తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ మద్యం విక్రయాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నాగులుప్పలపాడు మండలం నిడమానూరు గ్రామంలో ,నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఒక వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యం విక్రయాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసుల చర్యలు కొనసాగుతాయి.