– టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీనియర్ నేత
– విభేదాలుంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలి.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారుఇటీవల తెలుగుదేశం పార్టీని వీడాలనే ఆలోచన చేసిన బుచ్చిరెడ్డిపాళెం సీనియర్ నేత యర్రంరెడ్డి గోవర్థన్‌రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. శనివారం ఉదయం కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నివాసంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆయన, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే గారికి స్పష్టం చేశారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు, జిల్లా పరిశీలకులు డూండీ రాకేష్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ, పార్టీలో ఏవైనా విభేదాలు ఉంటే పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *