ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించింది.ఈ క్రమంలో నాగులుప్పలపాడు మండలంలోని హెచ్. నిడమానూరు గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అలాగే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్ళూరు గ్రామంలో ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.అదేవిధంగా చీమకుర్తి పట్టణంలోని జగన్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, చీమకుర్తి సీఐ ఆధ్వర్యంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరికూరపాడు గ్రామంలో కూడా CASO ఆపరేషన్ నిర్వహించారు.ఈ తనిఖీల ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలు మరియు నేరాలకు ఆస్కారం ఉన్న అంశాలపై పోలీసులు పరిశీలన చేపట్టారు. గ్రామాలు, కాలనీల్లో భద్రతను బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పోలీసుల పట్ల భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల తనిఖీలు, నిఘా చర్యలు కొనసాగుతున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *