తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, కటారి శంకర్ తదితర నాయకుల ఆధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా నాయకులు కుప్పం ప్రసాద్‌కు మద్దతుగా నిలిచారు. మేయర్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో నగరంలో ఎన్నికల సందడి నెలకొంది. నగర మేయర్ పదవికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలుతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఆయా పార్టీల నాయకులు తమ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు నగరంలో మేయర్ పదవికి సంబంధించిన ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.