తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో “వర్షిత” పుట్టినరోజు సేవా కార్యక్రమాలు, వంకాయలపాటి సాంబశివరావు కవిత దంపతుల కుమార్తె వర్షిత 18వ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు జిల్లా ప్రభుత్వ మాతా శిశు వైద్యశాల నందు తల్లి పిల్లలకు నూతన వస్త్రాలు బేబీ కిడ్స్, బ్రెడ్ పండ్లు కాయలు పంపిణీ ,బొమ్మరిల్లు అనాధ పిల్లల ఆశ్రమం నందు బియ్యము నిత్యవసర వస్తువులు విద్యార్థులకు నూతన వస్త్రాలు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. శివం శరణాలయం లోని వృద్ధులకు పౌష్టికాహారం తో కూడిన భోజనంతో పాటు పండ్లు కాయలు పంపిణీ చేయడం జరిగింది. ఒంగోలు బలరాం కాలనీలో డిపి ఫౌండేషన్ నందు వృద్ధులకు అన్నదాన నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ పుట్టినరోజులు సందర్భంగా ఆర్భాటాలు పోకుండా వర్షిత కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా పది మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మంచినేని మాధవి మాట్లాడుతూ వర్షిత కుటుంబ సభ్యులు వారి పిల్లల పుట్టిన రోజులు ప్రతి సంవత్సరం ఆర్భాటాలు పోకుండా నిస్సయిలైన పేదలకు ఆర్థికంగా అండగా నిలిచి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ పివి సుబ్బారావు మాట్లాడుతూ ప్రీతమ్ వర్షిత కుటుంబ సభ్యులు గత 8 సంవత్సరాల నుంచి పేద దివ్యాంగుల జంటలకు అన్ని తామై వివాహాలు జరిపించి మానవత్వం చాటారని తెలిపారు. ఈ సేవ కార్యక్రమంలో మాతా శిశు వైద్యశాల డాక్టర్ సంగ్మా, మానవత సేవా సంస్థ ప్రతినిధులు వడ్డెంపూడి రాజేశ్వరి, పులి శ్రీనివాసరావు తన్నీరు సురేష్, బాబురావు తో పాటు వర్షిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.