జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, “కనిగిరి రోడ్డులో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు ఆదివారం దాతల సహకారంతో కూరగాయలు పంపిణీ చేశాం. మా వంతుగా ఈ సహాయం అందించగలిగినందుకు సంతోషంగా ఉంది. అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడానికి మంచి మనసున్న వారు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇప్పటివరకు మాకు అండగా నిలిచిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని తెలిపారు.ఈ పంపిణీలో ప్రేమ్ బాబు, మైత్రేష్, నితీష్, చరణ్ తేజ, వేణుబాబు, చందన్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *