ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు.ఈ సందర్భంగా రౌడీషీటర్లు ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.నేరరహిత సమాజ నిర్మాణం, ప్రజల ప్రశాంత జీవనం, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *