తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, కొండపి మండలం, గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన నాయకులు శ్రీ సుబ్బులు రాచగొల్లు గారు, శ్రీ ఉండవల్లి సుబ్బారావు గారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు ఆదివారం పరామర్శించారు.గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, శస్త్రచికిత్స చేయించుకున్న వారిని ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చింతల వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.