తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు లోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల పై ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ గారు, పాశిం సునీల్ కుమార్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా, పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు ఈ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.