కొండపి మండల పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో గ్రామాల వారీగా పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ, సమష్టి కృషి మరియు పరస్పర సహకారంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన కార్యాచరణను రూపొందించుకుని, పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *