తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
సింగరాయకొండ మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయంలో, టంగుటూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి ఆధ్వర్యంలో, మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్. శ్రీ ఆదిమూలపు సురేష్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో MPTC, ZPTC, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా-నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎవరూ వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు.పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం నింపుతూ, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు ఈ సమావేశానికి టంగుటూరు మండలం 18 గ్రామాల గ్రామ అధ్యక్షులు, వివిధ హోదాలో అన్న అధ్యక్షులు, సెక్రటరీలు, కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తను, మహిళలు అందరు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.