తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు :-
ప్రకాశం జిల్లా పొన్నలూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.తమ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి డా. ఆదిమూలపు సురేష్‌ను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.గత రెండు రోజులుగా తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును అడ్డుకోవడం సరికాదని వారు అభ్యంతరం తెలిపారు.అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.పొన్నలూరులో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి.ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి.