తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ఒంగోలు నగరంలోని ఐదు డివిజన్ల పార్టీ నాయకులతో ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని పార్టీ నాయుకులతో సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని 1వ డివిజన్ త్రోవగుంట, 11వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, 22వ డివిజన్ పెళ్లూరు, 60వ డివిజన్ సత్యనారాయణపురం, 14వ డివిజన్ క్లోపేటకు చెందిన పార్టీ నాయకులతో ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితులు, ఎన్నికల కార్యాచరణ, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత, సమన్వయం ఎంతో ముఖ్యమని, ప్రతి డివిజన్‌లోనూ నాయకులు, కార్యకర్తలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా వివరించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను, స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి డివిజన్‌లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు కూడగట్టాలని అన్నారు. ఓటర్లను మర్యాదపూర్వకంగా కలిసి, కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. పార్టీ నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నడం జరిగినది.