తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డిపాళెం జడ్పీటీసీ అభ్యర్థి ఏటూరి శివ రామకృష్ణా రెడ్డితో పాటు మండలంలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి.ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. ‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావాలి.ఈ నెల 25వ తేదీ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుంటాను. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరిస్తాం.పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్త సేవలను గుర్తిస్తాం. విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేస్తూ, కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలి. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేద్దాం.