దర్శి మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా దారం సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే దర్శి మున్సిపాలిటీలోని 28 వార్డులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించిన దర్శి మున్సిపల్ ఎన్నికల అధికారి కె. అర్జున్ రావు గారు నూతన చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లకు డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి చెందిన 28 మంది కౌన్సిలర్లకు దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు అభినందనలు తెలియజేశారు.తమ ఎన్నిక సందర్భంగా అభినందనలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారికి నూతన చైర్మన్ దారం సుబ్బారావు, కూటమి కౌన్సిలర్లు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.దర్శి అభివృద్ధికి కూటమి నాయకత్వంలో నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *