తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
జరుగుమల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కూటమి పొత్తులో భాగంగా నామినేషన్లు వేసిన ఎంపీపీ అభ్యర్థి జోసెఫ్ గారు, జడ్పీటీసీ అభ్యర్థి పాతూరి కోటేశ్వరరావు గారి నేతృత్వంలో మండలంలోని దావగూడూరు గ్రామంలో శనివారం భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కూటమి మ్యానిఫెస్టోను, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీల శ్రేణులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.