తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగాయగుంట పంచాయతీకి చెందిన మునులపూడి ఎంపీటీసీ అభ్యర్థి చంద్రగిరి ప్రభాకర్ గారితో పాటు 30కి పైగా కుటుంబాలు, ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ పడమటిపాళెంకు చెందిన మాజీ ఎంపీటీసీ కునింగారి రమణయ్య గారి ఆధ్వర్యంలో 100 మందికిపైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు,వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరాను.