ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్ సీఐ కమలాకర్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చెంచయ్య మరియు సిబ్బంది జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించారు.ఇందులో భాగంగా కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న రెండు బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.1.కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలోని బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి, ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
2.కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో ఒక వ్యక్తి వద్ద అనధికారికంగా విక్రయించడానికి ఉంచిన 18 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో మొత్తం 32 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం సీసాలను మరియు వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *