జిల్లా కేంద్ర గ్రంధాలయం – ఒంగోలు నందు చదవటం మాకిష్టం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథపాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి పిల్లలతో పుస్తక పఠనం చేయించడం జరిగింది. తదుపరి పిల్లలతో నీతి కథలు సొంతంగా చెప్పించటం మరియు చదివించడం జరిగింది.ఈ సందర్భంగా ఉప గ్రంథపాలకురాలు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమని, పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సంపదతో పాటు మానసికాభివృద్ది జరుగుతుందని, చదవటం అనేది చురుకైన పఠనం ద్వారా మాత్రమే పెంపొందించుకొనే నైపుణ్యం అని తెలిపారు. తదుపరి శ్రీ పింగళి పాండు రంగరావు,విశ్రాంత ప్రిన్సిపాల్ వారు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలు -14 మరియు ఐరన్ పుస్తకాల ర్యాకులు -2 (అయిదు వేల రూపాయలు విలువ కలిగినవి) జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బహుమతిగా ఇవ్వటం జరిగింది. వారి తరఫున ఆ విరాళాలను శ్రీ సంకుల వేంకట స్వామి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఉప గ్రంథపాలకురాలుకు అందజేయటం జరిగింది.ఈ సందర్భంగా ఉప గ్రంథపాలకురాలు విరాళాలు ఇచ్చిన దాతలకు పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియపరచుకొనడమైనది.ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది యం. శ్రీనివాసులు, ఎ.శకుంతల, డి. సందీప్, శ్రీమతి యం. శివకుమారి, యస్.అనిల్ బాబు, జి. లక్ష్మీ మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *