అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి .రాజబాబు సంబంధిత అధికారులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత అధికారుల అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారుల కు సూచించారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. సాగర్ మిత్రను అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టే విధంగా మత్స్యకారులు అప్రమత్తం చేసే విధంగా ఉండాలని ఆయన సూచించారు. విలేజ్ లెవల్ అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సి పి డి సి ఎల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవసరం ఉందన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *