ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఒంగోలు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ గారు, ట్రాఫిక్ సీఐ గారు కలిసి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాదేవ ఏసీ లాంజ్ వద్ద ప్రయాణికులను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి, వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను నివారించడం, ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు.ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *