వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్ శ్రీ జూపూడి ప్రభాకరరావు గారు నెల్లూరు నగరంలోని 37వ, 43వ డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సత్తార్‌తో కలిసి నిర్వహించిన ప్రచారంలో రియాజ్, మీరా, మంజూర్, ఖయ్యాం, నిసార్, ఇంతియాజ్, ముజకీర్, షామీర్, సర్దార్, జిల్లా యువజన విభాగం కార్యదర్శి అరిఫుల్లా హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.అనంతరం 43వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీమతి రావులపల్లి వెంకట జ్యోతితో కలిసి జూపూడి ప్రభాకరరావు గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జూపూడి ప్రభాకరరావు గారు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలోని 37వ, 43వ డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రజాప్రతినిధుల ఎంపికలో ఓటర్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ప్రజల మద్దతుతో స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేసే నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *