తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థి జేవీ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కూటమి నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ఎన్నికల అబ్జర్వర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో సమన్వయంతో ముందుకు సాగాలని వారు సూచించారు. కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.