ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఎన్నికల కార్యాచరణను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని డివిజన్ల వారీగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రతి క్లస్టర్‌కు ముగ్గురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు తమ పరిధిలోని డివిజన్లలో పార్టీ పరిస్థితులను సమీక్షిస్తూ, కూటమి పార్టీల నాయకులతో, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లనున్నాయి.సమన్వయ కమిటీలు ప్రధానంగా డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సమన్వయం చేయడం, పార్టీ గెలుపునకు అనుకూలమైన పరిస్థితులను అంచనా వేయడం, స్థానికంగా ప్రజాదరణ కలిగిన నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి బాధ్యతలను అదేవిధంగా పార్టీ తరఫున టికెట్ ఆశించి అవకాశం లభించని నాయకులు, ఆశావహులను సమన్వయ కమిటీ సభ్యులు కలిసి బుజ్జగించాలని, వారందరినీ పార్టీ ఐక్యతలో భాగస్వాములను చేసి సమష్టిగా పనిచేసేలా చూడాలని ఎమ్మెల్యే జనార్దన్ గారు సూచించారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా, పార్టీ ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా సమన్వయ కమిటీలు పర్యవేక్షిస్తూ, డివిజన్ల వారీగా ప్రచార ప్రణాళికలను రూపొందించడం, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రజల్లోకి పార్టీ విధానాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణ, ఐక్యత, సమష్టి కృషితో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *