తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారు ఎస్టీపీసీలు (STPCs), స్టేషన్ సిబ్బందితో కలిసి సీతారాంపురం, శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించేలా మరియు అవాంఛనీయ సంఘటనలను నివారించేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ప్రజల రక్షణ, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.