తొలి శుభోదయం న్యూస్ నాగులుప్పలపాడు:-
ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చదలవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దారుణ ఘటనను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ప్రకాశం జిల్లా తీవ్రంగా ఖండించాము.ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం అందించారు.చిన్నారులపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సమాజానికి అత్యంత బాధాకరమైన విషయం. అభం శుభం తెలియని పసిపిల్లలపై జరిగే దాడులు మానవత్వానికే మచ్చ. చిన్నారుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసు అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని MRPS డిమాండ్ చేస్తోంది.
MRPS ప్రధాన డిమాండ్లు:
ఘటనపై పోలీసులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి.బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి తగిన భద్రత కల్పించి, న్యాయపరమైన సహాయం అందించాలి.ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహాయం, పరిహారం ఉంటే నిబంధనల ప్రకారం వెంటనే అందించాలి.చిన్నారులపై లైంగిక దాడుల నిరోధానికి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
బాధిత చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని, ఈ ఘటనపై ఎలాంటి రాజకీయ లేదా సామాజిక ఒత్తిళ్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సంబంధిత అధికారులను కోరుతున్నాం.చిన్నారులపై దాడులకు సమాజంలో చోటు ఉండకూడదు. బాధితులకు న్యాయం జరగాలి. నిందితులు చట్టం ముందు శిక్షించబడాలి.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) బాధిత చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలుస్తుందని తెలియజేస్తోంది.ఈ కార్యక్రమంలో MRPS వ్యవస్థాపకులు కొమ్మూరి గరటయ్య మాదిగ,మల్లెల ప్రసాద్ మాదిగ తగితరులు పాల్గొన్నారు.