స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నారు. సోమవారం కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం, ఎం. నిడమానూరు, పొందూరు గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రి సమావేశమై స్థానిక ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికీ ఇచ్చినా అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందన్నారు. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం నిలుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా పెద్ద మెత్తంలో ఫించన్లు ఇస్తున్నామని, అన్న క్యాంటీన్లతో పేదలకు రూ. 5 భోజనం పెడుతున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఎన్నికల్లో చెప్పకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇవన్నీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియచెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *