తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి ప్రజల నుంచే కాకుండా సొంత కేడర్ నుంచి విముఖత వ్యక్తమవుతోంది. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 21 వార్డులకు చెందిన 40 మంది వైసీపీ నాయకులు, వారి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం నాయకులు రాచూరి సత్యం, మారుతుం ప్రతాప్ రెడ్డి, వింజం రమేష్, ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ కండువలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశాను. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించుకొని రెట్టింపు ఉత్సాహంతో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేద్దాం.