పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమమును జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల విధులు, ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తులో పోలీసు శాఖలో చేరేందుకు విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా నిర్వహించమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని, బాగా చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణంలోని నారాయణ, భాష్యం పాఠశాలలు, ప్రతిభ కాలేజీ మరియు పలు స్కూలు, కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ఓపెన్ హౌస్ ప్రదర్శనలో పోలీసులు వాడే ఏకే-47, 9 MM గ్లాక్ పిస్టల్.,5.56 MM & 7.62 LMG (లైట్ మెషిన్ గన్స్).7.62 MM SLR, ఫెడరల్ గ్యాస్ గన్, .303 రాయిట్ గన్, 303 రఫీల్, 9 mm కార్బన్, ఇన్ శాస్ రైఫిల్, MP5K గన్స్, MP5A3 గన్స్, MSL గన్, 51MM మోర్టార్,మల్టీ షెల్ లాంచర్, 12 బోర్ పంప్ యాక్షన్ గన్, మెటల్ డిటెక్టర్, డ్రాగన్ లైట్, ర్యాకర్, బాంబు డిస్పోజల్ పరికరాలు, బాంబ్ బ్లాంకెట్, పలు పరికరాలు, వివిధ రైఫిల్స్ & పిస్టల్స్, 207 వజ్ర వాహనం, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందాలు, ట్రాఫిక్ పరికరాలు, రోడ్ సేఫ్టీ వాహనాలు, డ్రోన్ కెమెరాలు, వ్రేలిముద్రల సేకరించే పరికరాలు అవి పనిచేయు విధానం గురించి పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విద్యార్ధులకు వివరించారు. విన్యాసాల్లో భాగంగా ముందుగా రాక్సీ, సైరా, మగ్గి అనే పోలీసు జాగిలాలు జిల్లా ఎస్పీ గారికి గౌరవ వందనం చేశాయి. అనంతరం జాగిలాలు తమ విధి నిర్వహణలో భాగంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రదర్శించిన హార్డిల్స్‌ జంప్, ఫైర్‌ జంప్‌, ఒబీడియన్స్‌ విన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు,ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *