ఒంగోలు నగరంలోని 5వ డివిజన్ ఇస్లాంపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని శాసనసభ్యులు గారి నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇస్లాంపేటకు చెందిన వైసీపీ నాయకులు షేక్ సైదా, షేక్ పాఠాన్ ఖాన్, షేక్ సోహెల్ ఖాన్, షేక్ అబీద్‌తో పాటు సుమారు 20 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్ గారు, జనసేన నాయకులు కంది రవి శంకర్ గారు, టీడీపీ పరిశీలకులు శివప్రసాద్ గారు, 5వ డివిజన్ అభ్యర్థి అల్లా భక్షు, ఏఎంసీ డైరెక్టర్ షేక్ అమృల్లా, నామినేని మోహన్ రావు, షేక్ సద్దార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *