తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ స్వతంత్ర అభ్యర్థి దాసరి పిచ్చయ్య నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి రంగా గారి కుమార్తె ఆశాకిరణ్ గారిని వారి నివాసం లో కలవడం జరిగింది.ఆశాకిరణ్ గారు మాట్లాడుతూ రంగా గారి స్పూర్తి తో వారి అడుగు జాడల్లో నడుస్తున్న దాసరి పిచ్చయ్య గారి లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి మద్దతు తెలియజేశారు.అలాగే ఒంగోలు నగర ప్రజలు వారికి మద్దతుగా నిలబడి కుట్టు మిషన్ గుర్తుకి ఓటు వేసి వారికి అండగా నిలబడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు, పార్లమెంటు యువజన అధ్యక్షులు బండారు సురేష్, నగర అధ్యక్షులు నున్నా హరీష్, పర్చూరు నియోజకవర్గ కాపు యువ నాయకులు దాసం భాస్కర్, రాజు పాల్గొన్నారు.