తాళ్లూరు మండల రాజకీయ చరిత్రలో టీడీపీ సరికొత్త ఘనత సాధించింది. సుమారు 40 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠాన్ని దక్కించుకుంటోంది. తాళ్లూరు మండల ఎంపీపీగా బొమ్మిరెడ్డి రమణమ్మ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు అభినందనలు తెలిపారు.
ఈ విజయానికి కృషి చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి తాళ్లూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు:
▪️ శివరాంపురం – బొమ్మిరెడ్డి రమణమ్మ
▪️ మాధవరం – పాలెపోగు రవి
▪️ లక్కవరం – వల్లపు వెంకట సుబ్బారావు
▪️ తూర్పు గంగవరం–1 – యాడకి శ్రీకాంత్ రెడ్డి
▪️ తూర్పు గంగవరం–2 – బొల్లా నరేంద్ర పేద బాబు
▪️ దోసకాయలపాడు – కృష్ణం నాగేశ్వరరావు
▪️ వెలుగువారిపాలెం – ఆలూరి అక్కమ్మ
▪️ మన్నేపల్లి – గొల్లపాటి మేషేక్
▪️ తాళ్లూరు–1 – కోట వెంకటలక్ష్మి
▪️ తాళ్లూరు–2 – కాట్ రెడ్డి విజయ
▪️ నాగంబోట్లపాలెం – వేడుకొల్లు చంద్రమ్మ
▪️ బొద్దికూరపాడు – దేవుండ్ల లక్ష్మి
▪️ మల్కాపురం – వనపర్తి సంతోషం
▪️ తురకపాలెం – అన్నపురెడ్డి రమణ
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటకరంగ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, క్లస్టర్ నాయకులు కైపు నాగార్జున రెడ్డి, కోర్రపాటి వేణు, నవ్వులూరి విద్యాసాగర్‌తో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.తాళ్లూరు మండలంలో టీడీపీకి దక్కిన ఈ చారిత్రాత్మక విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *