ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ,స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించడం, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఎన్.జి. పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మనబ్రోలు, మాచవరం, రాపర్ల, ఉప్పుగుండూరు, ఎన్.జి. పాడు గ్రామాల్లో ఎస్‌ఐ, ఎన్.జి. పాడు పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *