తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
ముందుగా స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించి, డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కూటమి అభ్యర్థులతో కలిసి ప్రజలను కలిశాను.కూటమి తరఫున ఉలవపాడు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగోతు నటరాజ్ గారిని, టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కత్తి ప్రసాద్, మక్కే బుజ్జయ్య, గుమ్మడి పద్మావతి, పున్నేపల్లి శ్రీనివాసులు గార్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కరేడు ప్రజలను కోరాను.గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్లముందే ఉన్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, స్మశానాల అభివృద్ధి, లింక్ రోడ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి హామీలను అమలు చేసి చూపించాం. కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే.ఎవరు అభివృద్ధి చేశారు.. ఎవరు ప్రజలకు అండగా నిలిచారు అన్నది ఆలోచించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించండి.