తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి NG పాడు చెక్ పోస్ట్ మరియు అద్దంకి చెక్ పోస్ట్ లను తనిఖీ చేసారు. అద్దంకి తదితర ప్రాంతాలలో చెక్ పోస్ట్ ల ఆకస్మిక తనిఖీ చేశారు .NG పాడు గ్రామంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు విధానాన్ని పరిశీలించి సంబంధిత FST మరియు MCC టీంలకు తగునా సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఎఫ్ ఎస్ టి టీములు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, ఎం సి సి టీములతో స్థానిక ఎన్జీ పాడు మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలను చర్చించారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని , స్టాటిక్ సర్వేలెన్సీ టీములు తనిఖీలలో భాగంగా ఏమైనా కేసులు బుక్ చేసినట్లయితే సంబంధిత రిపోర్టులను సంబంధిత పరిశీలకులకు అందించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) నిబంధనలను తూచా .తప్పకుండా అమలు అయ్యేలా చూడాలన్నారు. వాహనాలను తనిఖీ చేసేటప్పుడు నిశితంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. వాహనాలలో అనుమానాస్పద వస్తువులు కానీ నగదు కానీ తగిన అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లయితే సదరు విషయాలను సంబంధిత అధికారులకు తెలపాలని అదేవిధంగా కేసులు బుక్ చేయాలని ఆమె తెలిపారు.