తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
ప్రజాసేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కొండపి నియోజకవర్గం పరిధిలోని పొన్నలూరు, మర్రిపూడి, కొండపి మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు మరియు మర్రిపూడి మండల జడ్పిటిసి సభ్యుడు బుధవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…ప్రజల మద్దతుతో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం శుభ పరిణామన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అధికారును సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి కూటమి అభ్యర్థులను గెలుపుకు కృషి చేయాలని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.