ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, వలేటివారిపాలెం మండలంలో 5 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 10 స్థానాలకు గాను, 5 చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మన్నూరు రత్న (చుండి), యాళ్ళ చిన్న మాలకొండయ్య (పోలినేనిచెరువు), నలగర్ల మాధవి (పోలినేనిపాలెం), గౌడపేరు రామయ్య (శాఖవరం), ఘట్టమనేని మౌనిక (పోకూరు)లు…. బుధవారం కందుకూరులోని టిడిపి కార్యాలయంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని సత్కరించారు. ఎమ్మెల్యే గారు వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించామని ఎమ్మెల్యే అన్నారు. మీరందరూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలి. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, క్లస్టర్ ఇంచార్జి ఘట్టమనేని లక్ష్మీనరసింహం, మండలంలోని పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *