తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు పొదిలి మరియు దర్శి ప్రాంతాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, అతివేగం, తప్పుదారి ప్రయాణం వంటి కారణాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ నియమాలను పాటించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *