తొలి శుభోదయం ప్రకాశం :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, సామాజిక శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో బహిరంగ మద్యపాన కేంద్రాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.అలాగే ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం ఫ్లైఓవర్ సమీపంలో స్థానిక ప్రజల సహకారంతో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు బహిరంగ మద్యపానం వల్ల కలిగే అనర్ధాలు, శాంతి భద్రతలకు ఏర్పడే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.పోలీసులు మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించి తమ పరిసరాలను శుభ్రంగా, భద్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు కూడా పాల్గొని సహకారం అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *