తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణం శ్రీరామనగర్ కాలనీలో గల స్వర్ణ వార్డు సచివాలయం -9 ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎవరెవరు ఏ విధుల్లోకి వెళ్లారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై స్థానికుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు, ఇతర పనులకోసం వచ్చిన వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సమయపాలన కూడా పాటించడం లేదన్నారు. ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని, లేకుంటే వెళ్లిపోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే వెంట పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, కోటపూరి శ్రీను, మోసంగి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *