తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ పాఠశాల (ఈదిగామిట్ట) లో SA Urdu గా పనిచేస్తున్న శ్రీమతి ఎస్‌.డి. ఫాతిమా బీ మేడం “జాతీయ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలు”గా ఎంపికై, “Qaumi Urdu Shikshak Karmachari Sangh – India” (Delhi) వారు నిర్వహించిన కార్యక్రమంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు.ఈ సన్మానం 26 అక్టోబర్ 2025, ఆదివారం నాడు ఘనంగా జరిగింది. అనంతరం సింగరాయకొండలో జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి గారు ఫాతిమా బీ మేడమ్‌ను అభినందించి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. ఆదిలక్ష్మి (PSHM) సమక్షంలో, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఎస్‌.కే. సందానీ బాషా (SA Biology), పుష్పావతి మేడం (SGT), ఎస్‌.కే. నస్రీన్ బాను (SGT Urdu), వహీదా మేడం (SGT) మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *