ప్రకాశంకాలనీ, రెవెన్యూ కాలనీల్లో పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణం 9వ వార్డు ప్రకాశంకాలనీ మరియు రెవెన్యూ కాలనీల్లో…. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. 30 మందికి పైగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వారికి పింఛన్ నగదు అందించారు. అమ్మా ! ఆరోగ్యం ఎలా ఉంది… ప్రతి నెలా ఒకటవ తేదీన పింఛన్ డబ్బులు ఇస్తున్నారా… పిల్లలు ఏం చేస్తున్నారు… పథకాలు సక్రమంగా అందుతున్నాయా… ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి… అంటూ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, దివ్యాంగులు… పింఛన్ డబ్బులు అందుకుంటూ మురిసిపోయారు. కూటమి ప్రభుత్వం పెంచి ఇస్తున్న పింఛన్ డబ్బులతో సంతోషంగా ఉన్నామని, మందులు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని ఎమ్మెల్యేతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చల్లగా ఉండాలని, పెద్ద కుమారుడిలాగా తమ బాగోగులు చూసుకుంటున్నారని సంతోషంగా మాట్లాడారు. తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగానే అందుతున్నాయని… తమ చుట్టుపక్కల కొత్త అభివృద్ధిని చూస్తున్నామని స్థానికులు ఎమ్మెల్యేతో చెప్పారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు బదులిస్తూ… మీ అందరి ఆశీర్వాదాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని, ప్రభుత్వ సహకారంతో మరిన్ని మంచి పనులు చేసి, 2029 ఎన్నికల్లో మీ ముంగిటకు వస్తానని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబుగారు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆయనకు అందరూ సపోర్టుగా నిలవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, స్థానిక నాయకులు వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, వార్డు అధ్యక్షులు పర్సు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చదలవాడ ఇమ్మానియేలు, చేవూరి రమేష్, జడ పోతయ్య, వంకాయలపాటి కోటేశ్వరరావు, ఉచ్చులూరి నిరంజన్, పర్సు కోటయ్య, అత్యాల నిరంజన్, గంధం సన్నీ, కంచర్ల గోపి, దామా కోటేశ్వరరావు, అత్తోట మాల్యాద్రి, దూదిపల్లి మహేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీను, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, వడ్డెళ్ళ రవిచంద్ర, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సవిడిబోయిన కృష్ణ, మాజీ కౌన్సిలర్ కొచ్చర్ల శ్రీను, చుండూరి శ్రీను, జియవుద్దీన్, కోట కిషోర్, మురారిశెట్టి సుధీర్, భవనాసి వెంకటేశ్వర్లు, అత్తింటి శివకృష్ణ, పీలా శ్రీను, పసుపులేటి రమణయ్య, రాయపాటి శ్రీను, అన్ని వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
