తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల వరకు జిల్లా ఎస్పీ నిర్వహిస్తున్న “డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమంలో శనివారం మొత్తం 41 మంది ఫిర్యాదుదారులు ఫోన్ కాల్ ద్వారా ఎస్పీ ని సంప్రదించి తమ సమస్యలను వివరించారు.ప్రతి కాలర్ తో వారి సమస్యను సవివరంగా అడిగి తెలుసుకున్న ఎస్పీ , సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, పెండింగ్ కేసులు ఉన్నచోట వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలు ఎటువంటి భయాందోళన లేకుండా తమ సమస్యలను పోలీసు అధికారులకు తెలియజేయాలని, పోలీసులు ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇటీవల తుపాన్ సమయంలో కొండేపి మండల పరిధిలో పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎంతో కృషి చేసి, కఠిన పరిస్థితుల్లోనూ విధులను నిర్వర్తించిన విషయాన్ని జిల్లా ఎస్పీకి తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో భూ/ఆర్థిక తగాదాలు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్, న్యూసెన్స్ చేస్తున్నారని, శారీరిక నేరాలు, డబ్బు సంబంధిత తగాదాలు మరియు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్బి ఎస్సై ఆంజనేయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
