తొలి శుభోదయం ప్రకాశం:-
మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో పాత కూచిపూడిపల్లికి చెందిన బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి కనిగిరి టౌన్ ఐస్ పార్లర్ సెంటర్లో పండ్లు కొనుగోలు చేస్తూ తన హ్యాండ్ బ్యాగ్ ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు.తరువాత ఆ స్థలంలో ఉన్న పండ్ల వ్యాపారి షేక్ గౌస్ భాషా గారు ఆ బ్యాగును పరిశీలించగా, అందులో సుమారు రూ.7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు రూ.50,000 నగదు ఉన్నట్లు గమనించారు.తక్షణమే షేక్ గౌస్ భాషా గారు నిజాయితీగా ఆ బ్యాగును కనిగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అనంతరం, పోలీసు అధికారులు ఆ బ్యాగు యజమాని మల్లయ్యను గుర్తించి, ఆ వస్తువులను ఆయనకు అందజేశారు.ఈ సందర్భంలో, మంచి మనసుతో తన వద్ద ఉన్న బ్యాగును పోలీస్ స్టేషన్ కు అప్పగించినందుకు కృతజ్ఞతా సూచకంగా, కనిగిరి డిఎస్పి శ్రీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐ షేక్ ఖాజావలి , ఎస్సై టి. శ్రీరాం లు షేక్ గౌస్ భాషా ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.