తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు “సండే ఆన్ సైకిల్స్” పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద ఎత్తున పాల్గొని శారీరక దృఢత్వం, కాలుష్య రహిత వాతావరణం, రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించారు.జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు సందేశం ఇచ్చారు “ఆరోగ్యమే మహాభాగ్యం, సైకిల్ పై ప్రయాణం పర్యావరణ హితం – ఆరోగ్య ప్రదం.”ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *