గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పీసీ పల్లి మండలం గుంటూరులింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేయుచున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులతో సోమవారం బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటూ ఎస్పీ సూచించారు.ఈ సమావేశంలో ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లపై మాట్లాడుతూ బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన స్థలాలకు నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా హాజరై ఉండాలని ఆదేశించారు.హెలిప్యాడ్, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ మార్గం, పైలాన్, సభా ప్రాంగణం ప్రాంతాల పరిసరాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కాన్వాయ్ వచ్చే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే VVIP/VIP వాహనాలను కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధులు నిర్వహించే సిబ్బంది సమయస్పూర్తితో, క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమానికి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.బందోబస్తు సమయంలో డ్రోన్లు మరియు సీసీ కెమెరాల సహాయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. రూటు బందోబస్తు విధులలో ఉన్న సిబ్బంది ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే వెంటనే సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇద్దరు ఏఎస్పీలు, ఎనిమిది డిఎస్పీలు, 20 సీఐలు, 49 ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు మరియు ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఆరు ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అనంతరం హెలిప్యాడ్ నుండి సభా స్థలి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయిల్ రన్‌ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. కాన్వాయ్ ప్రారంభం నుండి ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, క్రమపద్ధతిలో బందోబస్తు నిర్వహిస్తూ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు
జిల్లా ఎస్పీ వెంట కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *