తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కంభం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జునరావు ఒంగోలు పరిధిలోని వివిధ ఏటీఎంలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏటీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ సదుపాయాలు, నగదు భద్రతపై పరిశీలన చేపట్టారు.
ప్రజలు రాత్రి వేళల్లో ఎటిఎంలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఏటీఎంల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వహించడాన్ని కూడా పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.ప్రజల ఆర్థిక భద్రత కోసం నిరంతర తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.