తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజవర్గం:-
- 594 మార్కులతో టాప్ లో నిలిచిన సీహెచ్.మానస.
- 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.
- పదో తరగతిలో ఫలితాల్లో మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణత.
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్ విద్య పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో సీహెచ్ మానస అనే విద్యార్థిని 600కు 594 మార్కులు సాధించి టాప్లో నిలిచింది. తర్వాత శ్రీ మాన్య 587 మార్కులు, నిదర్శిని 579 మార్కులు సాధించారు.పదో తరగతిలో ఫలితాల్లో మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..31 మంది ఉత్తీర్ణత సాధించి విజయదుంధుబి మోగించారు. వారిలో 28 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం విశేషం.ఈ సందర్భంగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో సిహెచ్ మానసను అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను.