తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ఓపెన్ బూజింగ్ ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై గొడవలు, ప్రమాదాలు మరియు నేరాలకు దారితీసే బహిరంగ మద్యం సేవనాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ పరిసరాల్లో ఎక్కడైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.