తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఎస్బీఐలో సిబ్బంది కొరత, పాలసీ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్. చంద్రశేఖర్ నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాలేదని ఫెడరేషన్ పేర్కొంది. ఖాళీలను తక్షణమే భర్తీ చేయడం, పెన్షన్ మరియు సంస్కరణలు, ఇంటర్-సర్కిల్ బదిలీలు, అవుట్సోర్సింగ్ నిలిపివేత, ఉద్యోగులకు సమాన ప్రయోజనాలు, బ్యాంక్ పాలనలో ఉద్యోగుల ప్రతినిధిత్వం వంటి డిమాండ్లు ముందుంచింది. ఉద్యోగుల హక్కులు, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసమే సమ్మెకు దిగుతున్నామని నాయకత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో SBI Staff Union కందుకూరు రీజియన్ ఇంచార్జి వి.సుధాకర రావు, కందుకూరు రీజియన్ ఆఫీసు లోకల్ సెక్రటరీ బొమ్మల కిరణ్ కుమార్, కందుకూరు పరిసర బ్రాంచ్ లోని యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.